నాట్లు వేసేటపుడు నీరు పలుచగా ఉండాలి.
ఎండలు ఎక్కువగా ఉంటే ఊడ్చిన వెంటనే 5 సెంటి మీటర్ల వరకు నీరు నిలగట్టాలి.
మూన తిరిగిన రోజునుండి పైరు దుబ్బు చేయటం పూర్తి అయ్యేవరకు పొలంలో పలుచగా అంటే 2-౩ సెంటి మీటర్ల నీరుండాలి.
నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయటం పూర్తి అయ్యేవరకు పొలంలో పలుచగా అంటే 2-౩ సెంటి మీటర్ల నీరుండాలి.
నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు.
చిరు పొట్ట దశ నుండి గింజ గట్టి పడే వరకు 5 సెంటి మీటర్ల వరకు నీరుండాలి.
కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గింఛి ఆరబెట్టాలి.